లోక కల్యాణం కోసం ఖమ్మం నగరంలోని మమతా ఆసుపత్రి రోడ్ లో నిర్వహిస్తున్న సహస్ర చండీ యాగంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ పాల్గొని ప్రత్యేక హోమాలు చేశారు. అనంతరం యాగ నిర్వహణకు 50 కిలోల ఆవు నెయ్యిని అందించారు. ఈ కార్యక్రమంలో యాగ సంకల్ప పిత భవ్యశ్రీ వృథాశ్రమం నిర్వాహకులు సునీత, యాగకర్త దండ్యాల లక్ష్మణ్వు, గుర్రం మురళి, వేంపటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.