మలేసియా పర్యటన ముగించుకొని శుక్రవారం రాత్రి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరావుకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో నాయకులు చావా నారాయణరావు, కమర్తపు మురళి, సైదాబాబు, పోట్ల వీరేందర్, నల్లమల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆయిల్ ఫామ్ సాగు విధానం, నూనె గింజల ఉత్పత్తి, తదితర అంశాలపై అధ్యయనం చేయటానికి మలేషియా వెళ్లి వచ్చారు.