ఖమ్మం ధంసలాపురం న్యూ కాలనీకి చెందిన శీలం నాగేశ్వరరావు ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్మెంట్ పరిశోధక విద్యార్థి డాక్టరేట్ సాధించారు. 'సోషల్ సెక్యూరిటీ ఫర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్-ఏ స్టడీ ఆఫ్ సెలెక్ట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ' అనే అంశంపై ఓయూ సీనియర్ ప్రొఫెసర్, ఆలిండియా కామర్స్ అసోసియేషన్ ఫార్మర్ ప్రెసిడెంట్, ప్రొఫెసర్ కె. వి. చలపతి పర్యవేక్షణలో నాగేశ్వరరావు తన పరిశోధనను విజయవంతంగా పూర్తిచేశారు.