లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో నాణ్యత లోపించకుండా తగు జాగ్రత్తలు పాటించాలని జల వనరుల శాఖ ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి అధికారులకు సూచించారు. రఘునాథపాలెం మండలంలో రూ. 66 కోట్ల అంచనాతో నిర్మిస్తున్న మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను బుధవారం ఆయన తనిఖీ చేశారు. పంప్ హౌస్, పైపులైన్ నిర్మాణం, మోటార్ల కొనుగోలు, సబేస్టేషన్ నిర్మాణం, తదితర పనులపై సమీక్షించి ఇంజనీర్లకు, కాంట్రాక్ట్ సంస్థకు సూచనలు చేశారు.