ఖమ్మం ఎస్బీఐటీ కళాశాలలో గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్ఏబీ డీఎస్పీ కె. మధు మోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసైతే జీవితాలు ఆగమవుతాయని, దేశ భద్రతకు, ప్రభుత్వానికి, వ్యక్తిగతంగా నష్టం జరుగుతుందన్నారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, సేవిస్తున్నా టోల్ ఫ్రీ నంబర్ 1908 లేదా 87126 71111కు సమాచారం అందించాలన్నారు.