ఖమ్మం: హామీలు అమలు చేయాలని డీఆర్వో వినతి

72చూసినవారు
ఖమ్మం: హామీలు అమలు చేయాలని డీఆర్వో వినతి
కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ సర్పంచ్ గుత్తా వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ లో డీఆర్వో రాజేశ్వరీకి వినతి పత్రం అందజేశారు. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకుండా మోసం చేసిందని చెప్పారు. వరంగల్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్