ఖమ్మం. శ్రీ లక్ష్మి రంగనాథ ఆలయంలో ఏకాదశి వేడుకలు

0చూసినవారు
ఖమ్మం. శ్రీ లక్ష్మి రంగనాథ ఆలయంలో ఏకాదశి వేడుకలు
రంగనాయకుల గుట్టపై స్వయంభు కరిగిరి శ్రీలక్ష్మీ రంగనాథస్వామి వారి దేవస్థానంలో ఆదివారం తొలి ఏకాదశి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు బూరుగడ్డ శ్రీధరాచార్యులు తెలిపారు. ఉత్సవ మూర్తులకు విశేష అభిషేకం, సువర్ణపుష్పార్చన, ఉదయం 9: 30కు సుదర్శన హోమం, మధ్యాహ్నం 12 గంటలకు మహా పూర్ణాహుతి ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని సూచించారు.

సంబంధిత పోస్ట్