ఖమ్మం నగరంలోని ఇందిరానగర్లో విద్యుత్ పోల్ కు మంటలు అంటుకున్నాయి. చెత్తను తగలబెడుతుండగా పైన ఉన్న నెట్ కేబుల్ వైర్లకు మంటలు వ్యాపించాయి. పక్కనే పలు షాపింగ్ మాల్స్ ఉండటంతో స్థానికులు, నిర్వహకులు భయాందోళనలకు గురయ్యారు. సకాలంలో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అర్పివేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు.