ఖమ్మం: చనిపోయినా చిరస్థాయిగా చరిత్రలో అశ్విని పేరు

61చూసినవారు
ఖమ్మం: చనిపోయినా చిరస్థాయిగా చరిత్రలో అశ్విని పేరు
సింగరేణి మండలం గంగారంతండాకి చెందిన దివంగత యువ శాస్త్రవేత్త అశ్వినికి అరుదైన గౌరవం దక్కింది. ప్రొ. జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పూర్వ విద్యార్థిని అయిన ఆమె వ్యవసాయ రంగంలో ఎంతో కృషి చేశారు. గత ఏడాది వరదల్లో ఆమె కన్నుమూశారు. కానీ ఆమె ప్రతిభకు కేంద్రం తాజాగా గుర్తింపు అందించింది. అశ్విని పేరిట జాతీయ స్థాయిలో కొత్త శనగ వంగడాన్ని సోమవారం విడుదల చేసింది. త్వరలో గెజిట్ నోటిఫికేషన్‌లో ఆ వంగడాన్ని పొందుపరచనున్నారు.

సంబంధిత పోస్ట్