ఖమ్మం: పార్కుల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలి

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వాకర్స్ ప్యారడైజ్ ను శనివారం నగర మేయర్ పునుకొల్లు నీరజ సందర్శించారు. మార్నింగ్ వాకర్లతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వాకింగ్ ట్రాక్ పై ఒక లేయర్ మట్టి వేయాలని, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని వాకర్లు మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఐలాండ్ లో ఉన్న పంచతత్వ ట్రాక్ ను సందర్శించి వినియోగంలోకి తీసుకురావాలని, కూర్చునేందుకు సిమెంట్ బల్లాలను ఏర్పాటు చేయాలన్నారు.