ఖమ్మం: సహజ సేద్యంపై రైతులకు ప్రోత్సాహం

80చూసినవారు
ఖమ్మం: సహజ సేద్యంపై రైతులకు ప్రోత్సాహం
రసాయన ఎరువుల వాడకం తగ్గిస్తూ సహజ సిద్ధమైన ఎరువులతో పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఖమ్మం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఏళ్ల క్రితం సహజ సిద్ధంగా వ్యవసాయం చేయడంతో పంటల్లో పోషక విలువలు ఉండేవని తెలిపారు. ఇప్పుడు ఎరువులు అధికంగా వాడుతుండడంతో రైతులకు పెట్టుబడి పెరగడంతో పాటు పంట దిగుబడిలో నాణ్యత ఉండటం లేదన్నారు.

సంబంధిత పోస్ట్