మంగళవారం అర్దరాత్రి వేళ అనుకోకుండా కురిసిన అకాల వర్షానికి ఖమ్మం మార్కెట్‌లో నిల్వ చేసిన కోట్లాది రూపాయల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఖమ్మం మార్కెట్ అధికారులు కాపాడారు. మార్కెట్ కమిటీ ఉన్నతాధికారులు, ఆదేశాల మేరకు సకాలంలో అధికారులు స్పందించి అర్దరాత్రి వేళ మార్కెట్‌కు వెళ్లి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ మేరకు మార్కెట్‌లో అమ్మకానికి తీసుకొచ్చిన పంటలకు టార్పాలిన్‌లు ఇచ్చి పంటలను నీటితో తడిచిపోకుండా కాపాడారు. దీంతో రైతులు తమ హర్షం వెలిబుచ్చారు.