ఖమ్మం: ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి

57చూసినవారు
ఖమ్మం: ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి
ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇటికాల రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్ అధ్యక్షతన ఖమ్మంలో సోమవరం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు లేకుండానే ఫీజులు, ఇతరత్రా పేర్లతో రూ. కోట్లలో దండుకున్నాయని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్