

EXCLUSIVE VIDEO: చిత్తూరులో కాల్పుల కలకలం
AP: చిత్తూరు గాంధీ రోడ్డులో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ భవనంలోకి చొరబడిన దొంగల ముఠా తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపింది. ఇంటి యజమాని అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఘటనా స్థలానికి పోలీసులు భారీగా మోహరించారు. స్థానిక ప్రజలను ఖాళీ చేయించారు. తుపాకులతో పోలీసులూ రంగంలోకి దిగారు. ఐదుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. భవనంలో ఇంకొందరు దొంగలున్నట్లు సమాచారం. దొంగల వద్ద తుపాకులు ఉండటంతో స్థానికంగా హైటెన్షన్ నెలకొంది.