ఖమ్మం: సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాటం

57చూసినవారు
ఖమ్మం: సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాటం
సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట శనివారం చేపట్టిన ధర్నాకు వేలాదిగా జనం పోటెత్తారు. సమస్యలు పరిష్కరించాలని ఎర్ర జెండాలు, ఫ్లకార్డులతో బాధితులు కార్యాలయం ఎదుట బైఠాయించారు. మొత్తం 26కు పైగా సమస్యలు పరిష్కరించాలని అసిస్టెంట్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ.. పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్