
‘తండేల్’ టికెట్ ధరల పెంపునకు అనుమతి
AP: నాగచైతన్య హీరోగా నటించిన ‘తండేల్’ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీఫ్లెక్స్‌లో రూ.75 చొప్పున పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సినిమా విడుదల రోజు నుంచి వారం రోజుల పాటు ఇందుకు అవకాశమిస్తున్నట్లు హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ తెలిపారు. కాగా, ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదల కానుంది.