కరోనా కల్లోలంలో ఖమ్మం జిల్లా ప్రజలకు అండగా నిలవడంలో తమ మాజీ సైనిక ఉద్యోగులతో కలిసి బాధ్యతాయుతంగా కృషిచేసి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రామోజీ రమేష్ ను మాజీ సైనిక ఉద్యోగుల సంఘం తరుపున గురువారం నగరంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఆర్మీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎండి సుభాని, డిస్ట్రిక్ట్ సెక్రటరీ పీటల కృష్ణమూర్తి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.