ఖమ్మం: జిల్లా కలెక్టర్ కు మాజీ ఎమ్మెల్యే సండ్ర వినతి

59చూసినవారు
ఖమ్మం: జిల్లా కలెక్టర్ కు మాజీ ఎమ్మెల్యే సండ్ర వినతి
ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బుధవారం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వంలో సొంత ఇంటి నిర్మాణానికి రూ. 3లక్షల సాయంకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను నిరుపేదలకు అందచేయగా, ప్రస్తుత ప్రభుత్వం వాటికి సంబంధించిన జీవోను రద్దు చేసిందన్నారు. నియోజకవర్గంలో నిర్మాణ దశలో ఉన్న గృహాలను రాబోయే ఇందిరమ్మ పథకం కింద చేర్చి ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్