బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో శుక్రవారం సత్తుపల్లి మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకటవీరయ్య, కేటీఆర్ తో కలిసి పరామర్శించారు. శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న రాజేశ్వర్ రెడ్డి త్వరలోనే తిరిగి ప్రజాక్షేత్రంలో పూర్తి స్థాయిలో పాల్గొనాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.