ఖమ్మం: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని పరామర్శించిన మాజీ ఎంపీ నామ

59చూసినవారు
ఖమ్మం: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని పరామర్శించిన మాజీ ఎంపీ నామ
ప్రమాదవశాత్తూ జారిపడి గాయపడి యశోద ఆసుపత్రి (సోమాజిగూడ)లో చికిత్స పొందుతున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని బీఆర్‌ఎస్ పార్టీ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు బుధవారం పరామర్శించారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి కూడా ఉన్నారు. పల్లా ఆరోగ్య పరిస్థితిని ఎంపీ నామ అడిగి తెలుసుకన్నారు.

సంబంధిత పోస్ట్