ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థులకు రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఖమ్మం జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి కె. సత్యనారాయణ తెలిపారు. గ్రూప్-1 ప్రిలిమ్స్, గ్రూప్-2, 3, 4తో పాటు కేంద్ర ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, నాలుగు నెలల పాటు కొనసాగే శిక్షణకు అర్హులని తెలిపారు. వివరాలకు 9704003002 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.