ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలో గల రామదాసు మందిరమునకు బుధవారం గెల్లా కృష్ణారావు, పారేపల్లి గోపాలకృష్ణ శ్రీ సీతారామచంద్రస్వామి వారికి పూజల అనంతరం మహా నైవేద్యం పెట్టే సమయంలో స్వామివారికి, భక్తులకు అడ్డుగా ఉండే 2000 రూపాయల పరదా (కర్టెన్) ను బహుకరించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి అభిషేకం, అష్టోత్తర శతనామ పూజ జరిపి తదనంతరం తీర్థప్రసాదాలను పంచారు. ఈ కార్యక్రమంలో గండికోట వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.