
మే, జూన్ నెలల్లో రెండు పథకాల అమలు: మంత్రి కొలుసు
AP: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్న క్యాంటీన్లు అమలు చేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. తల్లికి వందనం (విద్యార్థికి రూ.15 వేలు), అన్నదాత సుఖీభవ (రైతులకు రూ.20 వేలు) పథకాలను మే, జూన్ నెలల్లో అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. కాగా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించిన విషయం తెలిసిందే.