ఖమ్మం: దాసాంజనేయస్వామి దేవస్థానంలో ఘనంగా గోదాదేవి కళ్యాణం

51చూసినవారు
ఖమ్మం: దాసాంజనేయస్వామి దేవస్థానంలో ఘనంగా గోదాదేవి కళ్యాణం
ఖమ్మం నగరం 26వ డివిజన్ రిక్కాబజార్ లో గల దాసాంజనేయస్వామి దేవస్థానంలో శుక్రవారం రాత్రి 8:00 గంటలకు ఘనంగా గోదాదేవి కళ్యాణం జరిగింది. మొదటగా విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ మహాసంకల్పం, లగ్నాష్టకాలు కళ్యాణం నిర్వహించారు. తదనంతరం గోదాదేవికి నీరాజన మంత్రపుష్పములు జరిపి తీర్థప్రసాద వినియోగము గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రతాపని నరసింహారావు, సూరవిష్టు, తదితర భక్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్