

బిహార్లో ఏడాదిగా నకిలీ పోలీస్ స్టేషన్ (వీడియో)
బిహార్లో ఓ వ్యక్తి ఏడాదిగా నకిలీ పోలీసు స్టేషన్ ఏర్పాటుచేసి యథేచ్ఛగా దందాలు చేశాడు. పూర్ణియా జిల్లాలోని మోహని గ్రామంలో రాహుల్ అనే వ్యక్తి పోలీస్ ఉద్యోగాల ముసుగులో యువత నుంచి రూ.లక్షలు వసూలు చేశాడు. గ్రామీణ రక్షాదళ్ రిక్రూట్మెంట్ పేరుతో కానిస్టేబుల్, చౌకీదార్ల నియామకాలు చేపట్టాడు. యూనిఫాం, లాఠీలు, నకిలీ గుర్తింపు కార్డులిచ్చాడు. పెట్రోలింగ్, మద్యం అక్రమ రవాణాపై దాడులు చేయించాడు. గుట్టు బయటపడటంతో రాహుల్ పరారయ్యాడు.