ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్, తళ్లాడ మండలం కుర్నవెల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రానికి ఎంత మేర ధాన్యం వచ్చింది, ఎంత కొనుగోలు చేసింది, ఎంత మేర ధాన్యానికి డబ్బు చెల్లించినది అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ఎఫ్ఏక్యూ నాణ్యత ప్రమాణాల మేరకు చేపట్టాలన్నారు.