ఖమ్మం: శివాలయంలో ఘనంగా భస్మాభిషేకం

81చూసినవారు
ఖమ్మం: శివాలయంలో ఘనంగా భస్మాభిషేకం
ఖమ్మం నగరం 27వ డివిజన్ టీచర్స్ కాలనీలో గల శివనాగ రాజేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం ఉదయం
11 గంటలకు రుద్రాక్షలతో, భస్మంతో ఘనంగా రుద్రాభిషేకం జరిగింది. మూలవరులకు ప్రాతఃకాలపూజ, నిత్య షోడశోపచారపూజ, నీరాజన, మంత్రపుష్పములు జరిగాయి. కార్తీకమాసం చివరిరోజున ఈ భస్మాభిషేకం ఎంతో విశేషమని ఆలయ పూజారులు తాటికొండాల శ్రీనివాస శర్మ, సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు.