ఖమ్మం నగరంలో స్విగ్గీ వర్కర్లను యాజమాన్యం ఇబ్బందులకు గురి చేయడం సరికాదని స్విగ్గీ రైడర్స్ యూనియన్ నాయకులు కృష్ణ అన్నారు. గురువారం స్విగ్గీ వర్కర్లతో కలిసి ఆయన ఖమ్మం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. పలు సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లిన వారిని బెదిరించి ఐడీలను బ్లాక్ చేస్తున్నారని చెప్పారు. బ్లాక్ చేసిన రైడర్స్ ఐడీలను అన్ బ్లాక్ చేసి, న్యాయం చేయాలని పేర్కొన్నారు.