వరంగల్- ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. శుక్రవారం యూటీఎఫ్ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్ నుంచి పెద్ద ఎత్తున భారీ ర్యాలీని చేపట్టారు. ఉపాధ్యాయ, అధ్యాపక పక్షాన పోరాడే అభ్యర్థికి పైరవీలు, వ్యక్తిగత ప్రయోజనాలు పొందే వారి మధ్య ఈ పోటీ అని నర్సిరెడ్డి పేర్కొన్నారు.