ఖమ్మం: పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలి

68చూసినవారు
పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని సీపీఎం ఖానాపురం హవేలి కార్యదర్శి దొంగల తిరుపతిరావు డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం నగరంలోని ఇందిరా నగర్ సర్కిల్ వద్ద సీపీఎం ఆద్వర్యంలో రోడ్డుపై కట్టెల పొయ్యి మీద వంటావార్పు నిర్వహించి నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలతో దేశ వ్యాప్తంగా 35 కోట్ల పేద, మధ్యతరగతి వినియోగదారులపై భారం మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్