ఆర్టీసీలో కార్మికులపై పెంచిన పని భారాలను తగ్గించాలని ఎస్.డబ్యు.ఎఫ్ ఖమ్మం రీజియన్ కార్యదర్శి పిట్టల సుధాకర్ అన్నారు. ఆదివారం ఖమ్మం రామయ్య స్మారక భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అటు ఆర్టీసీని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.