కూల్​ కూల్​ గా ఖమ్మం​.. ఒక్కసారిగా మారిన వాతావరణం

61చూసినవారు
కూల్​ కూల్​ గా ఖమ్మం​.. ఒక్కసారిగా మారిన వాతావరణం
ఖమ్మంలో మంగళవారం రాత్రి 2 గంటలకు గాలి దుమారంతో కురిసిన వర్షానికి బుధవారం ఉదయం వాతావరణం చల్లగా మారింది. ఉదయం మళ్ళీ చిన్న చిన్న చినుకులతో వర్షం ప్రారంభమై చూడ చక్కని వాతావరణం సంతరించుకుంది.
మంగళవారం దాకా మండే ఎండలతో సతమతమౌతున్న ప్రజలకు ఈ వర్షం ఎంతో హాయిని గొలిపిందని పలువురు ఆనంద పడుతున్నారు. పూర్తిగా మబ్బులు కమ్ముకున్న వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్