తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎమ్మెల్యే లేని ఒకే ఒక జిల్లా ఖమ్మం, జిల్లా అని తీన్మార్ మల్లన్న అన్నారు. ఎంబి గార్డెన్ పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో, బీసీ రిజర్వేషన్ బహుజన రాజ్యాధికార, సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఖమ్మం ప్రజలు చైతన్యవంతమైన ప్రజలని, బహుజన రాజకీయ ఉద్యమం ఇక్కడ నుంచే ప్రారంభం అవుతుందని అన్నారు.