డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఒకరికి జైలు శిక్ష, నలుగురికి జరిమానా విధిస్తూ ఖమ్మం స్పెషల్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి(స్పెషల్ మొబైల్ కోర్టు) బి. నాగలక్ష్మి తీర్పు వెలువరించారు. ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో పట్టుబడిన ఐదుగురిని శనివారం కోర్టులో హాజరుపరిచారు. గొల్లగూడెంకు చెందిన లారీడ్రైవర్ కు 3రోజులు జైలుశిక్ష విధించగా, ఇంకో నలుగురికి జరిమానా విధించారు.