ఖమ్మం నగరం బ్రాహ్మణ బజారులో గల నరసింహస్వామి దేవాలయంలో శనివారం ఉదయం 11-00 లకు భక్తులచే వైభవంగా కూడారై ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా మహిళా భక్తులు ఉదయం నుండే గోదాదేవిని అలంకరించి తిరుప్పావై, గోవిందనామాలు చదివి భజనలు చేశారు. తదనంతరం 108 గంగాళాలలో పాయసం, తులసిదళాలు ఉంచి పూజలు చేసి స్వామివారికి, గోదాదేవికి ఆరగింపు చేశారు. ఈ కార్యక్రమంలో బొలకొండ భవాని ఆలయ పూజారులు, అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.