ఖమ్మం నగరం 32వ డివిజన్ నర్తకి ధియేటర్ దగ్గర గల మురళీకృష్ణ మందిరంలో శనివారం ఉదయం 11:30 నిమిషాలకు ఘనంగా కూడారై మహోత్సవం జరిగింది. శనివారం ఉదయం 8:00 లకు కోవెలసేవ పాశుర, తిరుప్పావై పఠన అనంతరం మురళీకృష్ణ ఉత్సవ విగ్రహాలకు షోడశోపచార పూజలు ఆచరించి పాయసం నింపిన 108 గంగాళాలను చక్కగా వరుసలో పేర్చి కూడారై మహోత్సవము నిర్వహించి నీరాజన మంత్రపుష్పములు, తీర్థప్రసాద వినియోగము గావించారు.