ఖమ్మం నగరం ఇల్లందు రోడ్ దగ్గర గల కళాశాల మైదానంలో బుధవారం ఘనంగా కోటి దీపోత్సవం జరిగింది.
మొదటగా వేదపండితుల గణపతిపూజతో పూజా కార్యక్రమాలు ప్రారంభమైయ్యాయి. కార్తీక మాసం కావడం వల్ల అట్టహాసంగా జరిగిన దీపోత్సవం అధ్భుతమైన భక్తి పారవశ్యాన్ని పంచింది. కార్తీక దీపోత్సవంలో వందలాది మహిళలు ఒక్కసారిగా దీపాలు వెలిగించడంతో ఆ ప్రాంతమంతా దేదీప్యమానంగా వెలిగిపోయింది.