ఖమ్మం: గ్రంథాలయాలను సందర్శించిన కేఎంసీ కమిషనర్

51చూసినవారు
ఖమ్మం: గ్రంథాలయాలను సందర్శించిన కేఎంసీ కమిషనర్
ఖమ్మం నగరపాలక సంస్థ పరిధి గాంధీ పార్క్ లో ఉన్న గ్రంథాలయం, పాత మున్సిపల్ కార్యాలయంలో ఉన్న గ్రంథాలయాన్ని శనివారం కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య సందర్శించారు. అక్కడ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయంలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అభ్యర్థులకు పుస్తకాలు ఏమేం కావాలో అవి అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్