ఖమ్మం నగరం 53వ డివిజన్ యన్.యస్.టి రోడ్లో గల నరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం ఉదయం స్వామివారికి లక్ష తులసి పూజ ఘనంగా జరిగింది. ఉదయం స్వామివారికి పుణ్యాహవచనం జరిగిన తరువాత అభిషేకం చేశారు. అనంతరం స్వామివారికి లక్షతులసిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో అవధానులు అనిల్ శర్మ, కలకొడిమి రమేష్ శర్మ, చెఱువు సాయినాథశర్మ, యడవల్లి రాధాకృష్ణశర్మ పాల్గొన్నారు.