

టీడీపీ తోడేళ్లు, జనసేన గుంటనక్కలపై కేసులేవి: శ్యామల (వీడియో)
AP: కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ తోడేళ్లు, జనసేన గుంటనక్కలు సోషల్ మీడియాలో మహిళలపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ ఫ్యామిలీ సహా అందరిపైనా ఇష్టానుసారం ట్రోల్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. బరితెగించి పోస్టులు పెడుతున్న వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదంటూ ఆమె ప్రశ్నించారు. చేబ్రోలు కిరణ్‌ను అరెస్ట్ చేయడం ఒక డ్రామా మాత్రమేనని అన్నారు.