ఖమ్మం నగరం 26వ డివిజన్ అంగన్ వాడి కేంద్రంలో భీష్మ ఏకాదశి సందర్భంగా శనివారం చిన్నారులకు ఘనంగా అక్షరాభ్యాసాలు జరిగాయి. ఉదయం 10-00 లకు అంగన్ వాడి కేంద్రంలో మార్తి వీరభదప్రసాదశర్మ, విశాలక్ష్మి ఆధ్వర్యంలో చిన్నారులచే గణపతిపూజ, సరస్వతీపూజ జరిపించి పలకలు, బలపాలు వారికి ఇచ్చి " ఓం నమః శివాయః" అని చిన్నారులచే పలకలమీద రాయించారు.