ఖమ్మం పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలిలా. పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శనివారం ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. మరో మహిళకు గాయాలయ్యాయన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.