ఖమ్మం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరిగిన దివంగత వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ సంస్మరణ సభలో కాంగ్రెస్ యువనేత బీపీ నాయక్ శనివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మదన్ లాల్ ఆశయాలు, అనుభవాలు, బంజారా గిరిజన సమాజంలో విశిష్ట నాయకత్వాన్ని కొనియాడారు. మదన్ లాల్ నిర్మొహమాటమైన వైఖరి, రాజీపడని వ్యక్తి అని ఆయన అన్నారు.