ఖమ్మం: మహిళా రిజర్వేషన్ సదస్సు ను జయప్రదం చేయండి

76చూసినవారు
ఖమ్మం: మహిళా రిజర్వేషన్ సదస్సు ను జయప్రదం చేయండి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో డిసెంబర్ 6న వీర నారీమణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యాన రాజ్యాధికారం, మహిళా రిజర్వేషన్ పై నిర్వహించే సదస్సును జయప్రదం చేయాలని ఆ సంఘ జిల్లా మహిళా అధ్యక్ష, కార్యదర్శులు భుక్య ఉపేంద్రాబాయి, త్రివేణి అన్నారు. శుక్రవారం ఖమ్మం బీకేబజార్ సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఝాన్సీ, జ్యోతి, రమ, ప్రమిల ఉన్నారు.

సంబంధిత పోస్ట్