ఖమ్మం నగరంలోని పలు దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా శుక్రవారం ముక్కోటి ఏకాదశిపర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. స్థానిక రిక్కాబజార్ లోని సువర్చలా సమేత ఆంజనేయస్వామి దేవస్థానంలో శుక్రవారం. తెల్లవారుజాము నుండే ఆంజనేయస్వామికి అభిషేకం, నీరాజనం, మంత్రపుష్పములు సమర్పించి భక్తులకు ఉత్తర ద్వారదర్శనం కలిగించారు.