కష్టాల నుంచి విముక్తి కలిగించేది మార్క్సిజం మాత్రమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. శనివారం మండల పరిధిలోని కురనవల్లి ఫంక్షన్ హాల్ లో సత్తుపల్లి డివిజన్ రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభించి, అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గ దృక్పథంతో సీపీఎం పనిచేస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా చైనా సోషలిస్ట్ వ్యవస్థ బలమైన ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందిందన్నారు.