త్రీటౌన్ ప్రాంతంలో మట్కా జూదం విచ్చలవిడిగా కొనసాగిస్తున్నారని సీపీఐ త్రీటౌన్ సమితి ఆధ్వర్యాన ఎస్ఐ రమేష్ కు శనివారం మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ త్రీటౌన్ కార్యదర్శి నూనె శశిధర్ మాట్లాడుతూ. మట్కా జూదం కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుని వీధుల పాలవుతున్నారని, దీనిపై పోలీస్ యంత్రాంగం దృష్టి సారించి అరికట్టాలని కోరారు.