ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా మూడు రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం అమృత్ పథకంపై చర్చల అనంతరం కొత్త, పాత పార్లమెంట్ భవనాలను ఇతర పట్టణాల మేయర్లతో కలిసి సందర్శించారు. అనంతరం లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాతో కలిసి ఫొటో సెషన్లో పాల్గొన్నారు.