ఖమ్మం: ప్రజావాణిలో వినతులు స్వీకరించిన మేయర్

72చూసినవారు
ఖమ్మం: ప్రజావాణిలో వినతులు స్వీకరించిన మేయర్
ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. నగర మేయర్ పునుకొల్లు నీరజ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో వివిధ డివిజన్ల నుండి వినతులు స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేకు వచ్చిన అధికారులు మరొకసారి ఈనెల ఆఖరి వరకు సర్వేకు వస్తారని, ఎవరు ఆందోళన చెందొద్దని తెలిపారు. ఇంటి వద్ద లేని వారికి మరొసారి సర్వే నిర్వహిస్తారని చెప్పారు.