ఖమ్మం: రామాలయంలో మంత్రి తుమ్మల పూజలు

85చూసినవారు
ఖమ్మం: రామాలయంలో మంత్రి తుమ్మల పూజలు
ఖమ్మం 54వ డివిజన్ టీడీపీ ఆఫీస్ పక్కన గల రామాలయం నందు ఆలయ 6వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్